Corona Virus: దేశంలో 76.5 లక్షలు దాటిన కరోనా కేసులు

54044 new COVID19 infections India
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కరోనా కేసుల సంఖ్యపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 54,044 మందికి కరోనా నిర్ధారణ అయిందని  పేర్కొంది. అదే సమయంలో 61,775 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 76,51,108కి చేరింది.

గ‌త 24 గంట‌ల సమయంలో 717 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,15,914 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 67,95,103 మంది కోలుకున్నారు. 7,40,090 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.  
         
 
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 9,72,00,379 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,83,608 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News