తమిళనాడు ప్రభుత్వానికి, తమిళనాడు ప్రజలకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు
- వరద గుప్పిట్లో చిక్కుకుని విలవిల్లాడిన హైదరాబాదు
- హైదరాబాదుకు తమిళనాడు ప్రభుత్వం రూ.10 కోట్ల సాయం
- దుప్పట్లు, చాపలు కూడా పంపుతున్న తమిళ సర్కారు
రూ.10 కోట్ల సాయంతో పాటు దుప్పట్లు, చాపలు కూడా పంపిస్తున్నామని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారని వివరించింది. అంతేకాకుండా, మున్ముందు ఏదైనా సాయం కావాల్సి వస్తే చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తమిళనాడు ప్రభుత్వం, అక్కడి ప్రజలు సంఘీభావం ప్రకటించిన తీరు పట్ల ధన్యవాదాలు తెలిపినట్టు సీఎంఓ పేర్కొంది.