Corona Virus: దేశంలో కరోనాతో ఒక్క రోజులో వెయ్యికి పైగా మరణాలు

61871 New Covid Cases In A Day
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 61,871 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 74,94,552 కి చేరింది.

గ‌త 24 గంట‌ల సమయంలో 1,033 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,14,031 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 65,97,210 మంది కోలుకున్నారు. 7,83,311 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.  
       
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 9,42,24,190 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 9,70,173 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News