రాష్ట్రం మునిగిపోతుంటే హార్టికల్చర్ మీద సమీక్షలా?: కేసీఆర్‌పై కోదండరాం ఫైర్

TJS chief kodanda ram fires on cm kcr
  • మార్నింగ్ వాకర్లతో ముచ్చటించిన కోదండరాం 
  • ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజాధనాన్ని దోచుకునేందుకు ప్లాన్
  • ఆలోచించి ఓటు వేయాలని పిలుపు
ఓపక్క రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ తీరిగ్గా హార్టికల్చర్ మీద సమీక్షలు నిర్వహిస్తున్నారని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాలన ఎలా ఉందో ఈ ఒక్క విషయం ద్వారా అర్థం చేసుకోవచ్చన్నారు. నల్గొండలోని ఎన్‌జీ కళాశాలలో పట్టభద్రుల ఓటు నమోదుపై మార్నింగ్ వాకర్లతో కోదండరాం ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టభద్రులందరూ ఓటు నమోదు చేసుకోవాలని, ఆలోచించి ఓటు వేయాలని కోరారు.

రాష్ట్రంలో బాధ్యత రహిత, నిరంకుశ పాలన కొనసాగుతోందని తీవ్ర విమర్శలు చేశారు. ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజా ధనాన్ని దోచుకునేందుకు ప్రభుత్వం పథకం వేసిందని, డబ్బులు చెల్లించకుంటే ఆస్తులన్నీ అక్రమమేనన్నట్టు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావులందరూ ఆలోచించి ఓటు వేయాలని కోదండరాం కోరారు.
Go Back to Shorts
Kodandaram
TJS
Nalgonda District
KCR
LRS

More Telugu News