భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సూచనలు
- ప్రతి ఒక్కరూ ప్రజలకు సాయపడాలి
- వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
- సాయపడుతోన్న వాలంటీర్లకు అభినందనలు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె చెప్పారు. ప్రజలకు సాయపడుతోన్న వాలంటీర్లను ఆమె అభినందించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని ఆమె చెప్పారు. అధికారులు, సిబ్బంది ప్రజల ఇబ్బందులను తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా, సహాయక చర్యల నిమిత్తం జీహెచ్ఎంసీ సిబ్బంది నిన్నటి నుంచే రంగంలోకి దిగి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు.