రేణుకా చౌదరి ఇంట్లో దొంగతనం!

13-10-2020 Tue 20:46
Robbey in Renuka Chowdarys home
  • బంజారాహిల్స్ లోని ఇంట్లో దొంగతనం
  • రూ. 3 లక్షల నగదు, రూ. 3.5 లక్షల విలువైన ఆభరణాల చోరీ
  • సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి నివాసంలో చోరీ జరిగింది. హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఉన్న ఆమె నివాసంలో రూ. 3 లక్షల నగదు, రూ. 3.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయి.

ఈ దొంగతనానికి సంబంధించి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఆమె ఇంటితో పాటు, సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇంట్లో పని చేసేవాళ్లు ఈ చోరీకి ఒడిగట్టారా? లేక బయటి నుంచి వచ్చిన వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారా? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.