Zee Telugu: ఏపీ ఆరోగ్యశ్రీ ట్రస్టుకు 10 అంబులెన్సులు అందించిన జీటీవీ తెలుగు యాజమాన్యం... డ్రైవర్ సీట్లో రోజా!

Zee TV Telugu donates ten ambulances to AP Arogya Sri Trust
  • విజయవాడలో అంబులెన్స్ లు అందజేత
  • కార్యక్రమంలో పాల్గొన్న పేర్ని నాని, రోజా
  • అంబులెన్స్ లు ప్రారంభించిన వైసీపీ ప్రజాప్రతినిధులు
ఏపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా వైద్య సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆరోగ్యశ్రీ ట్రస్టుకు జీటీవీ తెలుగు చానల్ యాజమాన్యం 10 నూతన అంబులెన్స్ లను అందించింది. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ అంబులెన్స్ లను ఏపీ మంత్రి పేర్ని నాని, ఏపీఐఐసీ చైర్ పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రోజా అంబులెన్స్ నడిపి అందరినీ అలరించారు.

రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, సీఎం జగన్ ప్రయత్నానికి జీటీవీ యాజమాన్యం తనవంతుగా సాయపడుతోందని, ఈ దిశగా అంబులెన్స్ లు ఇవ్వడం సంతోషదాయకమని పేర్కొన్నారు. రోజా మాట్లాడుతూ, దేశంలో ఎవరూ చేయని విధంగా సీఎం జగన్ పేదలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారని కొనియాడారు.
Zee Telugu
Ambulance
Arogyasri
Andhra Pradesh
Perni Nani
Roja

More Telugu News