K Kavitha: ముందు జాగ్రత్తగా హోమ్ క్వారంటైన్ కు వెళ్లనున్న కవిత

Kavitha is going to quarantine for 5 days
  • జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కు కరోనా పాజిటివ్
  • నిన్న సంజయ్ ను కలిసిన కవిత
  • ఐదు రోజులు క్వారంటైన్ లో ఉంటానని ప్రకటన
టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా గెలుపొందిన కల్వకుంట్ల కవిత ఐదు రోజుల పాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్లనున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆమె ప్రకటించారు. నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలెక్షన్ కౌంటింగ్ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను ఆమె కలిశారు.

తాజాగా ఆయనకు కరోనా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. గత ఐదు రోజులుగా తనతో కాంటాక్ట్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ హోమ్ ఐసొలేషన్ కు వెళ్లాలని, కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని ఆయన కోరారు.

దీనిపై కవిత స్పందిస్తూ, 'అన్నా మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. నేను మిమ్మల్ని కలిసిన నేపథ్యంలో హోం క్వారంటైన్ కు వెళ్తున్నా. ముందు జాగ్రత్త చర్యగా ఐదు రోజుల పాటు క్వారంటైన్ లో ఉంటా. కొన్ని రోజుల పాటు పార్టీ శ్రేణులు ఎవరూ నా కార్యాలయానికి రావద్దని కోరుతున్నా' అని కవిత ట్వీట్ చేశారు.
K Kavitha
Corona Virus
TRS
Quarantine

More Telugu News