రెండోసారి కరోనా వస్తే తీవ్రంగా ఉంటుందన్న అమెరికా వైద్యులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రెండోసారి కరోనా వస్తే తీవ్రంగా ఉంటుందన్న అమెరికా వైద్యులు

US doctors say corona will be re infected to who got once
  • కరోనా రెండోసారి కూడా రావొచ్చని వెల్లడి
  • వారిలో తీవ్ర లక్షణాలు కనిపిస్తాయని వివరణ
  • లాన్సెట్ జర్నల్ లో పరిశోధన వివరాలు
కరోనా వైరస్ గురించి అమెరికా వైద్యులు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. కరోనా వైరస్ ఒకసారి నయమైన తర్వాత మళ్లీ సోకే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఒకసారి వచ్చిన తర్వాత మళ్లీ రాదన్న భరోసా ఏమీలేదని వారు స్పష్టం చేశారు. పైగా, మొదటిసారితో పోల్చితే రెండోసారి వైరస్ సోకినప్పుడు తీవ్రమైన లక్షణాలకు గురవుతారని వివరించారు.

నెవాడాకు చెందిన ఓ వ్యక్తి  48 రోజుల వ్యవధిలో మరోసారి కరోనా బారినపడ్డాడని అమెరికా వైద్యులు వివరించారు. దాంతో ఆ వ్యక్తి తీవ్రస్థాయిలో శ్వాస సంబంధ సమస్యలకు గురికాగా, ఆక్సిజన్ సాయం అందించాల్సి వచ్చిందని తెలిపారు. ఈ మేరకు ప్రముఖ వైద్య పరిశోధన పత్రిక లాన్సెట్ జర్నల్ లో పరిశోధనాత్మక వివరాలు ప్రచురించారు. రెండుసార్లు కరోనా వచ్చిన కేసులు అమెరికాలోనే కాకుండా హాంకాంగ్, ఈక్వెడార్, బెల్జియం, నెదర్లాండ్స్ దేశాల్లోనూ వచ్చాయని లాన్సెట్ జర్నల్ లో పేర్కొన్నారు.
Corona Virus
Re Infection
Doctors
USA
Lancet Journal

More Telugu News