తమిళనాడు సీఎం పళనిస్వామికి మాతృవియోగం

13-10-2020 Tue 15:00
Tamilnadu CM Palaniswami mother dies of Heart Attcack
  • గుండెపోటుకు గురైన అమ్మాళ్
  • సేలం జిల్లా సిలువంపాళయంలో అంత్యక్రియలు
  • సీఎంకు ప్రముఖుల పరామర్శలు

తమిళనాడు ముఖ్యమంత్రి యడప్పాడి పళనిస్వామికి మాతృవియోగం కలిగింది. పళనిస్వామి తల్లి తవసై అమ్మాళ్ ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అమ్మాళ్ వయసు 93 సంవత్సరాలు.

అర్ధరాత్రి దాటిన తర్వాత ఆమెకు గుండెపోటు రాగా, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అమ్మాళ్ కన్నుమూశారు. రాష్ట్రమంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అన్నాడీఎంకే నేతలు అమ్మాళ్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. మాతృవియోగం పొందిన పళనిస్వామిని ప్రముఖులు పరామర్శించి తమ సంతాపం తెలియజేశారు.

కాగా అమ్మాళ్ అంత్యక్రియలు సేలం జిల్లా సిలువంపాళయంలో నిర్వహించనున్నారు. అంత్యక్రియల నిమిత్తం ముఖ్యమంత్రి పళనిస్వామి ఇప్పటికే సేలం చేరుకున్నారని రాష్ట్ర వర్గాలు తెలిపాయి.