రెండోసారి కరోనా వస్తే తీవ్రంగా ఉంటుందన్న అమెరికా వైద్యులు
- కరోనా రెండోసారి కూడా రావొచ్చని వెల్లడి
- వారిలో తీవ్ర లక్షణాలు కనిపిస్తాయని వివరణ
- లాన్సెట్ జర్నల్ లో పరిశోధన వివరాలు
నెవాడాకు చెందిన ఓ వ్యక్తి 48 రోజుల వ్యవధిలో మరోసారి కరోనా బారినపడ్డాడని అమెరికా వైద్యులు వివరించారు. దాంతో ఆ వ్యక్తి తీవ్రస్థాయిలో శ్వాస సంబంధ సమస్యలకు గురికాగా, ఆక్సిజన్ సాయం అందించాల్సి వచ్చిందని తెలిపారు. ఈ మేరకు ప్రముఖ వైద్య పరిశోధన పత్రిక లాన్సెట్ జర్నల్ లో పరిశోధనాత్మక వివరాలు ప్రచురించారు. రెండుసార్లు కరోనా వచ్చిన కేసులు అమెరికాలోనే కాకుండా హాంకాంగ్, ఈక్వెడార్, బెల్జియం, నెదర్లాండ్స్ దేశాల్లోనూ వచ్చాయని లాన్సెట్ జర్నల్ లో పేర్కొన్నారు.