హైదరాబాద్ లో భారీ వర్షం.. వీడియో ఇదిగో

heavy rain in hyderabad
  • పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం 
  • జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, షేక్‌పేట పరిసర ప్రాంతాల్లో వర్షం
  • నల్లకుంట, నాచారం, మల్కాజ్‌గిరి, ఉప్పల్‌ లో భారీ వాన
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో  ఓ మోస్తరు వర్షం పడుతోంది. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, షేక్‌పేట, టోలిచౌకితో పాటు బేగంపేట, ఎస్సార్‌ నగర్‌, ముషీరాబాద్‌ , చిక్కడపల్లి, రాంనగర్‌, అబిడ్స్‌, అఫ్జల్‌గంజ్‌, కోఠి,  రాజేంద్ర నగర్‌, నార్సింగి, మణికొండ, అంబర్‌పేట, నల్లకుంట, నాచారం, మల్కాజ్‌గిరి, ఉప్పల్‌ లో భారీ వాన కురుస్తోంది.

ఒక్కసారిగా కురుస్తోన్న వానతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు, ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని ఇతర జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో రేపు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Go Back to Shorts
rain
Hyderabad

More Telugu News