ఎదురులేని ముఖేశ్ అంబానీ... భారత్ లో మరోసారి నెంబర్ వన్
- భారత బిలియనీర్ల జాబితా వెలువరించిన ఫోర్బ్స్
- వరుసగా 13వ సారి ముఖేశ్ ఘనత
- జాబితాలో నలుగురు తెలుగు వ్యాపారవేత్తలు
ఫోర్బ్స్ జాబితాలో తెలుగు వ్యాపారవేత్తలు
ఈసారి ఫోర్బ్స్ సంస్థ వెలువరించిన టాప్-100 భారత బిలియనీర్ ర్యాంకుల జాబితాలో తెలుగు వ్యాపారవేత్తలు కూడా స్థానం దక్కించుకున్నారు. దివీస్ ల్యాబొరేటరీస్ అధినేత మురళి దివి (6.5 బిలియన్ డాలర్లు) 20వ స్థానంలో, డాక్టర్ రెడ్డీస్ కుటుంబం (3.25 బిలియన్ డాలర్లు) 43వ స్థానంలో, మేఘా ఇంజినీరింగ్ పీపీ రెడ్డి (3.1 బిలియన్ డాలర్లు) 45వ స్థానంలో, అరబిందో రాంప్రసాద్ రెడ్డి (2.9 బిలియన్ డాలర్లు) 49వ ర్యాంకులో నిలిచారు.