Alia Bhat: తెలుగుతో కుస్తీ పడుతున్న ముంబై టాప్ హీరోయిన్!

Alia Bhat learning Telugu
షార్ట్స్‌లో చూడండి
ఒకప్పుడు తెలుగు అమ్మాయిలైన మన హీరోయిన్లే తమకు తాము డబ్బింగ్ చెప్పుకోలేకపోయేవారు. డబ్బింగ్ ఆర్టిస్టులు ఎవరో ఒకరు వాళ్లకు చెప్పాల్సి వచ్చేది. అయితే, నేటి తరం కథానాయికలు అందుకు భిన్నం. ముఖ్యంగా ముంబై భామలు చాలా యాక్టివ్ గా వుంటున్నారు. తెలుగులో ఒకటి, రెండు సినిమాలు చేయగానే, తెలుగు మాట్లాడేస్తున్నారు. తమకు తామే డబ్బింగ్ చెప్పుకోవడానికి కూడా రెడీ అయిపోతున్నారు.

ఈ క్రమంలో బాలీవుడ్ భామ అలియా భట్  కూడా తెలుగులో డబ్బింగ్ చెప్పడానికి సిద్ధపడుతోంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో చరణ్ సరసన ఈ ముద్దుగుమ్మ సీత పాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ చిత్రం తెలుగు వెర్షన్లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలని అలియా నిర్ణయించుకుందట. దాంతో ప్రస్తుతం ట్యూటర్ ని పెట్టుకుని తెలుగు నేర్చుకుంటోందని తెలుస్తోంది.

ఇదిలావుంచితే, లాక్ డౌన్ తర్వాత ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే హైదరాబాదులో మొదలైంది. కరోనా నేపథ్యంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని తక్కువ మంది యూనిట్ తో షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ పై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక హీరోయిన్ అలియా భట్ వచ్చే నెలలో ఈ చిత్రం షూట్ లో పాల్గొంటుందని తెలుస్తోంది.
Go Back to Shorts
Alia Bhat
Rajamouli
Charan
RRR

More Telugu News