మేము గనుక అధికారంలో ఉంటే 15 నిమిషాల్లో చైనాను తరిమేసేవాళ్లం: రాహుల్ గాంధీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మేము గనుక అధికారంలో ఉంటే 15 నిమిషాల్లో చైనాను తరిమేసేవాళ్లం: రాహుల్ గాంధీ

rahul gandhi slams modi
  • మన భూభాగాన్ని ఎవ్వరూ తీసుకోలేదని ప్రధాని చెబుతున్నారు
  • ఒక దేశ భూభాగాన్ని మరో దేశం ఆక్రమించుకుంది  
  • ప్రధాని తనను తాను దేశ భక్తుడిగా చెప్పుకుంటున్నారు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు.  మన దేశ భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని ఆయన ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే. హర్యానాలో పర్యటిస్తోన్న రాహుల్ ఈ సందర్భంగా ఓ సమావేశంలో మాట్లాడుతూ.. భారత్‌-చైనా మధ్య తూర్పు లడఖ్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలను గురించి ఆయన ప్రస్తావించారు.
 
'మన దేశ భూభాగాన్ని ఎవ్వరూ తీసుకోలేదని ఈ పిరికి ప్రధాని చెబుతున్నారు. ఒక దేశ భూభాగాన్ని మరో దేశం ఆక్రమించుకుంది. అలా భూమిని కోల్పోయిన దేశం ప్రపంచంలో ఈవేళ ఒక్కటే ఉంది. అయినప్పటికీ, మన దేశ ప్రధాని తనను తాను దేశ భక్తుడిగా చెప్పుకుంటున్నారు. మేము గనుక అధికారంలో ఉంటే చైనాను 15 నిమిషాల్లో తరిమేసేవాళ్లం' అని రాహుల్ గాంధీ చెప్పారు.
Rahul Gandhi
Congress
Narendra Modi
China

More Telugu News