గోవాలో నితిన్ సినిమా షూటింగుకి ఏర్పాట్లు.. లొకేషన్ల ఎంపిక!
- మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రీమేక్
- నితిన్ హీరో.. కీలక పాత్రలో శ్రియ
- గోవాలో లొకేషన్ల ఎంపికలో దర్శకుడు
- ఇటలీలో కూడా కొంత షూటింగ్ ప్లాన్
ఈ నేపథ్యంలో నితిన్ హీరోగా నటించనున్న 'అంధాదున్' చిత్రం రీమేక్ కి కూడా షూటింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం లొకేషన్ల అన్వేషణ జరుగుతోంది. ఇందులో భాగంగా దర్శకుడు గాంధీ, ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేశ్ ప్రస్తుతం గోవాలో లొకేషన్లను ఎంపిక చేస్తున్నారు.
ఈ విషయాన్ని తెలుపుతూ సాహి సురేశ్ అక్కడి తమ ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నవంబర్ నుంచి షూటింగును ప్రారంభించుకునే ఈ చిత్రంలో ప్రముఖ నటి శ్రియ కీలక పాత్రను పోషించనుంది. గోవాతో పాటు కొంత షూటింగును ఇటలీలో కూడా చేయనున్నట్టు తెలుస్తోంది.