'కౌన్ బనేగా కరోడ్ పతి'లో తెలుగు టీచర్.. ఆమె గురించి తెలుసుకుని అమితాబ్ ప్రశంసలు
- ఈ రోజు రాత్రి ప్రసారం
- పాల్గొన్న అల్వాల్ టీచర్ సబితా రెడ్డి
- భర్తను కోల్పోయినప్పటికీ పిల్లలకు మంచి విద్య
సబితా రెడ్డి భర్తను కోల్పోయినా అధైర్య పడకుండా కష్టపడి తన పిల్లలను పెంచుతున్నారు. వారికి మంచి విద్యను అందిస్తానని అన్నారు. వారికి ఆస్తులు ఇవ్వకున్నా, మంచి విద్యను అందివ్వాలని ఆమె అన్నారు. ఈ రోజు రాత్రి కేబీసీ 12 నుంచి 6వ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఇందులో మొత్తం ఏడుగురు కంటెస్టెంట్లు పాల్గొన్నారు. సబితారెడ్డితో పాటు పాల్గొన్న మరో కంటెస్టెంట్ ప్రదీప్‌కుమార్ సూద్ ఈ ఎపిసోడ్‌లో 12.5 లక్షల రూపాయలు గెలుచుకున్నారు.