Kajal Agarwal: పెళ్లి తేదీని అధికారికంగా ప్రకటించిన హీరోయిన్ కాజల్!

Kajal About her Marriage
  • ఈ నెల 30న నా పెళ్లి
  • ముంబైలో గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకోబోతున్నాను
  • వివాహ వేడుక నిరాడంబరంగా జరగనుంది
  • కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నందుకు చాలా థ్రిల్‌గా ఉంది
హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన పెళ్లి గురించి ప్రకటన చేసింది. ఆమె ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకోబోతోందని వార్తలు వచ్చిన తెలిసిందే. ఈ విషయంపై ఆమె పూర్తి క్లారిటీ ఇచ్చేస్తూ ట్వీట్టర్‌లో ప్రకటన చేసింది.
 
'నేను ఈ నెల 30న ముంబైలో గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకోబోతున్నానని చాలా సంతోషంతో చెబుతున్నాను. మా దగ్గరి బంధువులతో కలిసి ఈ వివాహ వేడుక నిరాడంబరంగా జరగనుంది. ఈ కరోనా మహమ్మారి మన సంబరాలను పూర్తిస్థాయిలో జరుపుకోనివ్వకుండా చేసింది' అని ఆమె ట్వీట్ చేసింది.

'అయినప్పటికీ, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నందుకు మేము చాలా థ్రిల్‌గా భావిస్తున్నాము. మీరు కూడా ఇదే తీరుతో మాకు మద్దతు ఇస్తారని కోరుకుంటున్నాను. ఇన్నేళ్లుగా మీరు నాపై చూపిస్తోన్న ప్రేమ పట్ల కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ కొత్త ప్రయాణాన్ని మొదలు పెడుతున్న నేపథ్యంలో మీ ఆశీర్వాదాలను మేము కోరుకుంటున్నాము. ఇకపై కూడా నా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూనే ఉంటాను' అని కాజల్ ట్వీట్ చేసింది.

Kajal Agarwal
Tollywood
marriage

More Telugu News