పెళ్లిపీటలు ఎక్కనున్న సాయి ధరమ్ తేజ్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెగాస్టార్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెళ్లిపీటలు ఎక్కనున్న సాయి ధరమ్ తేజ్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెగాస్టార్!

Actor Sai Dharam Tej marriage fixed
  • బంధువుల అమ్మాయిని పెళ్లాడనున్న సాయి తేజ్
  • వచ్చే వేసవిలో పెళ్లి జరిగే అవకాశం
  • టాలీవుడ్ లో వరుసగా  మోగుతున్న పెళ్లి బాజాలు
టాలీవుడ్ లో యువ హీరోలంతా ఒక్కొక్కరుగా పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. లాక్ డౌన్ టైమ్ లోనే రానా, నితిన్, నిఖిల్ పెళ్లి చేసుకున్నారు. మరికొందరికి పెళ్లిళ్లు ఫిక్స్ అయిపోయాయి. కొణిదెల నిహారికకు జొన్నలగడ్డ చైతన్యతో నిశ్చితార్థం జరిగింది. పెళ్లి డేట్ ఖరారు కావాల్సి ఉంది.

మరోవైపు మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పెళ్లికొడుకు కాబోతున్నాడు. ఇంట్లోవాళ్లు చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఏపీకి చెందిన బంధువుల అమ్మాయినే పెళ్లాడుతున్నాడని సమాచారం. సాయి తేజ్ పెళ్లికి ఆయన మేనమామ చిరంజీవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెపుతున్నారు. వచ్చే ఏడాది వేసవిలో పెళ్లి జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే దీనిపై మెగా ఫ్యామిలీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
Sai Dharam Tej
Tollywood
Marriage

More Telugu News