నమ్మించి నట్టేట ముంచిన కుటుంబం.. జనానికి రూ. 3.50 కోట్లకు కుచ్చుటోపీ
- ఖమ్మంలో ఘరానా మోసం
- వడ్డీ ఆశ చూపి నమ్మిన వారి నుంచి డబ్బులు వసూలు
- వ్యాపారం పేరుతో కోట్లలో నిత్యావసరాలు తీసుకుని మోసం
వ్యాపారులను నమ్మించేందుకు తొలుత కొంత డబ్బులు చెల్లించేది. ఆ తర్వాత రేపు, మాపు అంటూ వాయిదా వేస్తూ వచ్చింది. ఈ క్రమంలో రూ. 70 లక్షలు ఇచ్చిన ఖమ్మం రూరల్ మండలానికి చెందిన మాలోతు సునీత మోసపోయినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలి కుమారులైన పురాణం శివ, పురాణం శంకర్‌లను నిన్న అరెస్ట్ చేశారు. కీలక నిందితురాలైన పురాణం శివకుమారి, పురాణం గోపీకృష్ణ పరారీలో ఉన్నారు. వీరిపై మొత్తం ఏడు చీటింగ్ కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు.