Gudiwada Amaranath: అవినీతికి చంద్రబాబు అన్న అయితే, సబ్బం హరి తమ్ముడు: గుడివాడ అమర్నాథ్

 Gudiwada Amarnath warns TDP leader Sabbam Hari
  • వివాదాస్పదంగా మారిన సబ్బం హరి ప్రహరీగోడ కూల్చివేత
  • సబ్బం హరి పార్కు స్థలాన్ని ఆక్రమించారన్న అమర్నాథ్
  • సబ్బం ఆస్తులు ప్రజలకు తెలుసని వ్యాఖ్యలు
టీడీపీ నేత సబ్బం హరి ఇంటి ప్రహరీ గోడను అధికారులు కూల్చివేయడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ విషయంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో అనకాపల్లి ఎమ్మెల్యే, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ ఘాటుగా స్పందించారు. సబ్బం హరి పార్కు స్థలాన్ని ఆక్రమించారని, పదేళ్లు ప్రజాప్రతినిధిగా ఉండి ఎన్ని ఆస్తులు సంపాదించారో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అవినీతికి అన్న అయితే, సబ్బం హరి తమ్ముడని అమర్నాథ్ విమర్శించారు. అవినీతిలో పెద్ద నేతలకు టీడీపీలో ఉన్నత పదవులు లభిస్తాయని అన్నారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలకు పార్టీ పదవులు ఇవ్వడం చంద్రబాబు నీతికి అద్దం పడుతోందని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా అమర్నాథ్ టీడీపీ నేత సబ్బం హరికి గట్టి హెచ్చరికలు చేశారు. సీఎం జగన్, విజయసాయిరెడ్డిల గురించి మాట్లాడే అర్హత సబ్బం హరికి ఉందా అని ప్రశ్నించారు. సబ్బం హరి మాట్లాడుతున్న భాష అభ్యంతరకరంగా ఉందని, ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని స్పష్టం చేశారు. ఇలాగే నోటికొచ్చినట్టు మాట్లాడితే సీఎం జగన్ సైనికుడిలా వెళ్లి సబ్బం హరి నాలుక కోస్తానని అన్నారు.
Gudiwada Amaranath
Sabbam Hari
Jagan
Vijay Sai Reddy
Chandrababu
YSRCP
Telugudesam
Andhra Pradesh

More Telugu News