Kishan Reddy: ఈ రెండు కుటుంబాల నుంచి తెలంగాణను విముక్తం చేయాలి: కిషన్ రెడ్డి

Kishan Reddy calls BJP cadre for defeat of TRS and MIM
  • కల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాలపై కిషన్ రెడ్డి ధ్వజం
  • తెలంగాణను ఈ కుటుంబాలే ఏలుతున్నాయని వ్యాఖ్యలు
  • టీఆర్ఎస్ సర్కారు మాటలకే పరిమితమైందని విమర్శలు
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి నేడు హైదరాబాద్ అంబర్ పేట నియోజకవర్గంలో పర్యటించారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా గౌతమ్ రావు పదవీబాధ్యతలు స్వీకరించే కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణను కల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాలు ఏలుతున్నాయని, ఈ రెండు కుటుంబాల నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించాలని పిలుపునిచ్చారు.

కల్వకుంట్ల కుటుంబం నుంచి తెలంగాణను, ఒవైసీ కుటుంబం నుంచి హైదరాబాద్ ను విడిపిస్తామని అన్నారు. తెలంగాణ ప్రజల కలలు సాకారం చేయకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైందని ఆరోపించారు. హైదరాబాదులో ఇకపై మజ్లిస్ పెత్తనం కొనసాగనిచ్చేదిలేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో మరో పార్టీ ఉండకూడదు అన్నట్టుగా  టీఆర్ఎస్ వ్యవహరిస్తోందని విమర్శించారు. .
Kishan Reddy
BJP
MIM
Telangana

More Telugu News