Uttar Pradesh: యూపీలో మరో ఘోరం... పొలాల్లో ముక్కలుగా నరికిన స్థితిలో బాలిక మృతదేహం!

Girl Mutaliated Body Found in UP Fields
  • యూపీలో రోజుకో అత్యాచారం వెలుగులోకి
  • సెప్టెంబర్ 26న అదృశ్యమైన బాలిక
  • ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఇటీవలి కాలంలో అత్యాచారాలు ఎక్కువై పోయిన ఉత్తరప్రదేశ్ లో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్ 26న కనిపించకుండా పోయిన బాలిక, పొలాల్లో ముక్కలుగా నరికిన స్థితిలో విగతజీవిగా కనిపించింది. ఈ ఘటన కాన్పూర్ దేహత్ జిల్లాలో జరుగగా, ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశామని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. తమ బిడ్డపై అత్యాచారం చేసి, హత్య చేశారని బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు రిజిస్టర్ చేసి, దర్యాఫ్తు ప్రారంభించారు.

బాలిక మృతదేహం భాగాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, ఈ ఘోరానికి పాల్పడింది బాలిక బంధువులేనని అనుమానిస్తూ, వారిని అరెస్ట్ చేశామని కాన్పూర్ దేహత్ జిల్లా ఎస్పీ కేకే చౌదరి వెల్లడించారు. తమ భూమిపై వివాదాలు ఉన్నాయని, వాటి నేపథ్యంలోనే తన బిడ్డపై హత్యాచారం చేశారని బాధితురాలి తండ్రి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసును విచారిస్తున్నామని తెలిపారు.
Uttar Pradesh
Rape
Mutaliated
Dead Body
Police

More Telugu News