KTR: ప్రగతి భవన్ లో కొత్త అంబులెన్సులను ప్రారంభించిన కేటీఆర్

KTR inaugurates new ambulances
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ మంత్రి కేటీఆర్ తన జన్మదినం సందర్భంగా పిలుపునిచ్చిన 'గిఫ్ట్ ఏ స్మైల్'కు మంచి స్పందన వస్తోంది. ఆయన పిలుపుకు స్పందించి పలువురు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు తమ సొంత నిధులతో 21 కోవిడ్ రెస్పాన్స్ అంబులెన్స్ లను ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు.  

మంత్రులు ఈటల రాజేందర్, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీలు రంజిత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, నన్నపనేని నరేందర్, ఉపేందర్ రెడ్డి, ఆరూరు రమేశ్, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, వరంగల్ కు చెందిన లక్ష్మణరావు ఈ అంబులెన్సులను ఇచ్చారు.

ప్రగతి భవన్ లో ఈ అంబులెన్సులను కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. మరోవైపు వీటిని హైదరాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్, కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో వినియోగించనున్నారు.
Go Back to Shorts
KTR
TRS
Ambulances

More Telugu News