అమీర్ పేటలో షాపింగ్ మాల్ ప్రారంభించిన టీఆర్ఎస్ నేత కవిత

01-10-2020 Thu 16:10
Kavitha inaugurates showroom in Ameerpet
  • మాంగళ్య షాపింగ్ మాల్ ను ప్రారంభించిన కవిత
  • కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్
  • షోరూమ్ లో చీరలను పరిశీలించిన కవిత

హైదరాబాద్ అమీర్ పేటలో నూతనంగా ఏర్పాటు చేసిన మాంగళ్య షాపింగ్ మాల్ ను టీఆర్ఎస్ నాయకురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కూడా హాజరయ్యారు. రిబ్బన్ కటింగ్ అనంతరం ఆమె షోరూమ్ లో తిరుగుతూ చీరలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వరంగల్ లో తొలి షోరూమ్ ను ప్రారంభించిన కొద్ది కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది షోరూమ్ లను ప్రారంభించడం గొప్ప విషయమని అభినందించారు. మరిన్ని షోరూమ్ లను ప్రారంభించి మరికొందరికి ఉపాధి అవకాశాలను కల్పించాలని కోరారు. నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తే ప్రజలు ఆదరిస్తారని తెలిపారు.