Allu Arjun: 'పుష్ప' కోసం యాక్షన్ ఎపిసోడ్ రిహార్సల్స్!

Action episode  rehearsals for Pushpa flick
  • సుకుమార్ దర్శకత్వంలో బన్నీ 'పుష్ప'
  • మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్?
  • యాక్షన్ ఎపిసోడ్ తో షూటింగ్ మొదలు    
ఆరు నెలల సుదీర్ఘ గ్యాప్ తర్వాత స్టార్ హీరోలు ఒక్కొక్కరే షూటింగులకు బయలుదేరుతున్నారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ చేస్తున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ నెల 15 నుంచి హైదరాబాదులో షూటింగ్ చేయడానికి రానున్నారు.

ఈ క్రమంలో అల్లు అర్జున్ కూడా షూటింగుకి రెడీ అవుతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం తను 'పుష్ప' సినిమా చేస్తున్నాడు. లాక్ డౌన్ కి ముందు ఈ చిత్రం షూటింగ్ కొంత కేరళ అడవుల్లో జరిగింది. ఇప్పుడు మళ్లీ షూటింగుకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఈ చిత్రకథ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగేది కావడంతో అడవుల్లోనే ఎక్కువ షూటింగ్ చేయాల్సివుంది. అందుకే ఈసారి మొదలెట్టే షెడ్యూలును కూడా అడవుల్లోనే చేయడానికి నిర్ణయించారు. ఇందుకోసం కేరళ కానీ, రాజమహేంద్రవరం సమీపంలోని మారేడుమిల్లి అడవులకు కానీ వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు. ముందుగా బన్నీ, ఫైటర్లు పాల్గొనే భారీ యాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేస్తారట. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన రిహార్సల్స్ ను హైదరాబాదులో నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరు నుంచి షూటింగుకి వెళతారని అంటున్నారు.

ఇందులో అల్లు అర్జున్ పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ పాత్ర చిత్తూరు యాస మాట్లాడుతుంది. ఇక కథానాయికగా రష్మిక నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.
Allu Arjun
Rashmika Mandanna
Sukumar
Pushpa

More Telugu News