Corona Virus: దేశంలో 62 లక్షలు దాటిన కరోనా కేసులు

COVID19 tally crosses 62lakh mark
షార్ట్స్‌లో చూడండి
భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 62 లక్షలు దాటింది. గత 24 గంటల్లో దేశంలో 80,472 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 62,25,764 కి చేరింది.

గ‌త 24 గంట‌ల సమయంలో 1,179 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 97,497 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 51,87,826 మంది కోలుకున్నారు. 9,40,441 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.  
         
 
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 7,41,96,729 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,86,688 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID-19
India

More Telugu News