Akumarthi Jyothi: దుబాయ్ లో వ్యభిచారం నిర్వహిస్తున్న పాలకొల్లు మహిళ అరెస్ట్!

Akumarthi Jyothi who is running prostitution in Dubai arrested
  • మహిళలను నిర్బంధిస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్న జ్యోతి
  • లుకౌట్ నోటీసులు జారీ చేసిన ఏపీ పోలీసులు
  • బెంగళూరు ఎయిర్ పోర్టులో అరెస్ట్
దుబాయ్ లో మహిళలను నిర్బంధిస్తూ, మోసం చేస్తూ వ్యభిచారంలోకి దింపుతున్న ఆకుమర్తి జ్యోతి ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. బెంగళూరు ఎయిర్ పోర్టులో ఆమెను అరెస్ట్ చేశారు. ఏపీకి చెందిన 11 మంది మహిళలు తమను ఈ మురికికూపం నుంచి రక్షించాలంటూ ముఖ్యమంత్రి జగన్ కు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం... ఇండియన్ ఎంబసీ ద్వారా బాధిత మహిళలను ఏపీకి తీసుకొచ్చింది.

ఇదే సమయంలో ఆకుమర్తి జ్యోతిపై మొగల్తూరు, కలిదిండి, టి.నరసాపురం, కర్నూలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో, దుబాయ్ నుంచి బెంగళూరుకు చేరుకున్న జ్యోతిని ఎయిర్ పోర్టు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారు ఇచ్చిన సమాచారంతో జ్యోతిని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు నరసాపురం పోలీస్ స్టేషన్ కు తరలించి, విచారిస్తున్నారు. ఆకుమర్తి జ్యోతిది పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు కావడం గమనార్హం. పోలీసు విచారణలో సెక్స్ రాకెట్ కు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Akumarthi Jyothi
Dubai
Prostitution

More Telugu News