Devineni Uma: వీరి అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు జగన్?: దేవినేని ఉమ

devineni uma slams jagan
  • కృష్ణా జిల్లా నందిగామలో సెంటు పట్టా పథకంలో మోసాలు
  • రైతుల వద్ద ముందే చెక్కులు తీసుకొని అవకతవకలు
  • ఎకరానికి 10 లక్షల  చొప్పున బ్యాంకుల నుండి విత్ డ్రా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. కృష్ణా జిల్లా నందిగామలో సెంటు పట్టా పథకంలో అవకతవకలపై ఈనాడు దినపత్రికలో వచ్చిన కథనాన్ని ఆయన పోస్ట్ చేస్తూ దానిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

సెంటు పట్టా పథకంలో దోపిడీ, రైతుల వద్ద ముందే చెక్కులు తీసుకొని ఎకరానికి 10 లక్షల రూపాయల చొప్పున బ్యాంకుల నుండి విత్ డ్రా, నివాసయోగ్యం కాకపోయినా మీ పార్టీనాయకులు, వారు చెప్పిన భూములే కొనుగోలు.. రాష్ట్రంలో భూముల కొనుగోలు, మెరక పేరుతో మీ ప్రజాప్రతినిధుల అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు వైఎస్ జగన్? అని దేవినేని ఉమ ప్రశ్నించారు.  

Devineni Uma
Telugudesam
Krishna District

More Telugu News