shruti hassan: బట్టలు ఉతకడం వంటి ఇంటి పనులన్నీ నేనే చేసుకుంటా: హీరోయిన్ శ్రుతిహాసన్

i wash cloths says shruti
  • సెలబ్రిటీలు ఇంటి పనులు కూడా చేస్తారా? అని అడుగుతుంటారు
  • ఇటువంటి పనులు చేయడం ఒక ఛాలెంజా?
  • ఆ పనులు అందరూ చేయాల్సినవే
  • ఒంటరితం అంటే నాకెంతో ఇష్టం
బట్టలు ఉతకడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం వంటి అన్ని ఇంటి పనులూ తానే చేసుకుంటానని హీరోయిన్ శ్రుతిహాసన్ చెప్పింది.  తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... సెలబ్రిటీలు ఇంటి పనులు కూడా చేస్తారా అంటూ చాలామంది ఆశ్చర్యపోతుంటారని తెలిపింది. లాక్‌డౌన్‌లో వంటపాత్రలు కడిగే పోటీలో పాల్గొంటారా? అని కొందరు చాలెంజ్‌ చేశారని చెప్పింది. అయినా ఇటువంటి పనులు చేయడం ఒక ఛాలెంజా? ఆ పనులు అందరూ చేయాల్సినవేనని ఆమె చెప్పింది.

తాను చెన్నై ఎప్పుడు వచ్చినా తన తండ్రి కమల‌హాసన్‌ను కలుస్తానని తెలిపింది. ఇక తాను ఇంట్లో ఒంటరిగానే ఉంటానని, ఒంటరితం అంటే తనకెంతో ఇష్టమని చెప్పింది. లాక్‌డౌన్‌ సమయంలో ఒంటరిగా గడిపినప్పటికీ తనకు బోర్ ‌కొట్టలేదని తెలిపింది. ఒంటరిగా ఉంటే భయమేస్తుందని కొందరు అంటుంటారని, తాను మాత్రం కొన్నేళ్లుగా ఒంటరిగానే ఉంటున్నానని తెలిపింది.
shruti hassan
Tollywood
Bollywood

More Telugu News