nagma: హీరోయిన్ల పరువు తీయడమే మీ పనా?: డ్రగ్స్‌ కలకలంపై నగ్మా వ్యాఖ్యలు

nagma fire on ncb
  • డ్రగ్స్‌ వాడానంటూ కంగన చెప్పింది
  • వాట్సప్‌ మెసేజ్‌ల ఆధారంగా హీరోయిన్లకు సమన్లు
  • బహిరంగంగా అంగీకరించిన కంగనను ఎందుకు విచారించట్లేదు?
  • సెలబ్రిటీల సమాచారాన్ని మీడియాకు ఎందుకు అందచేస్తున్నారు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్‌ మృతి కేసులో డ్రగ్స్ కోణం బయటపడడంతో దీనిపై విచారణ జరుపుతోన్న అధికారులు పలువురు సినీ ప్రముఖులకు సమన్లు పంపిన విషయం తెలిసిందే. అయితే, ఒకప్పుడు తాను డ్రగ్స్‌ వాడానంటూ హీరోయిన్‌ కంగనా రనౌత్ చెప్పినప్పటికీ ఆమెకు అధికారులు సమన్లు ఎందుకు ఇవ్వలేదని సినీ నటి, కాంగ్రెస్‌ నేత నగ్మా ప్రశ్నించారు. కేవలం వాట్సప్‌ మెసేజ్‌ల ఆధారంగా హీరోయిన్లకు సమన్లు ఇచ్చారని, మరి బహిరంగంగా అంగీకరించిన కంగనా రనౌత్‌కు మాత్రం ఎందుకు సమన్లు పంపలేదని ఆమె నిలదీశారు.

డ్రగ్స్‌కు సంబంధించి సెలబ్రిటీల సమాచారాన్ని మీడియాకు అందచేసి ప్రజల్లో వారి పరువు తీయడమే ఎన్సీబీ అధికారుల ఉద్యోగమా? అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది నిజంగా విచారకరమైన విషయమని చెప్పుకొచ్చింది. కాగా, బాలీవుడ్‌లో డ్రగ్స్‌ కేసు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియో ఇటీవల వైరల్ అయింది. నటనలో ఆసక్తి ఉండడంతో తాను టీనేజ్‌లో ఇంటి నుంచి పారిపోయి ముంబైకి వచ్చానని,  డ్రగ్స్‌కి కూడా బానిసను అయ్యానని తెలిపింది. అయితే, ప్రస్తుతం డ్రగ్స్‌ తీసుకునేవారితో తనకి ఎలాంటి సంబంధాల్లేవని ఇటీవలే కంగనా రనౌత్ ట్వీట్ చేసింది.
nagma
Bollywood
Kangana Ranaut

More Telugu News