Actor: వీడియో చాటింగ్ యాప్‌పై సినీనటి, ఎంపీ నుస్రత్ జహాన్ ఫిర్యాదు

  • వీడియో చాటింగ్ యాప్‌పై పోలీసులకు ఫిర్యాదు
  • అనుమతి లేకుండా తన ఫొటో వాడుకున్నారంటూ ఆరోపణ 
  • దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
Nusrat Jahan compliant against video chatting app

ఆన్‌లైన్ ప్రమోషన్ కోసం తన అనుమతి లేకుండా తన ఫొటో వాడారంటూ సినీనటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ ట్విట్టర్ ద్వారా ఓ వీడియో చాటింగ్ యాప్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఫొటో వాడుకున్న యాప్ స్క్రీన్‌షాట్‌ను పోస్టు చేసిన ఎంపీ కోల్‌కతా పోలీస్ కమిషనర్ అనుజ్ శర్మను ట్యాగ్ చేశారు. సైబర్ సెల్ పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో తాను న్యాయపరంగా ముందుకెళ్తానని పేర్కొన్నారు.

‘‘అనుమతి లేకుండా ఫొటోలు వాడడం  ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈ విషయంపై కోల్‌కతా సైబర్ సెల్  పోలీసులు దృష్టిసారించాలి. దీనిని నేను చట్టపరంగా ఎదుర్కొంటాను’’ అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఎంపీ ఫిర్యాదు నేపథ్యంలో సైబర్ సెల్ దర్యాప్తు ప్రారంభించినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

More Telugu News