శర్వానంద్ సినిమా కూడా ఇక డిజిటల్ రిలీజేనా!
- ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో రిలీజైన 'వి'
- దిల్ రాజుని అనుసరిస్తున్న మరికొందరు
- శర్వానంద్ 'శ్రీకారం' కూడా ఓటీటీ విడుదల?
ఈ క్రమంలో యంగ్ హీరో శర్వానంద్ హీరోగా నటించిన 'శ్రీకారం' చిత్రం కూడా ఓటీటీ ద్వారా డైరెక్టు రిలీజ్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. నూతన దర్శకుడు కిశోర్ రెడ్డి దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం వాస్తవానికి మొన్న వేసవిలోనే విడుదల కావాలి. థియేటర్లు మూతపడడం వల్ల ఆగిపోయింది. ఇక ఇప్పట్లో థియేటర్లు తెరుచుకోవడం సాధ్యపడదన్న వార్తలు వస్తుండడంతో నిర్మాతలు డిజిటల్ రిలీజ్ కి మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో శర్వానంద్ పల్లెటూరి యువకుడిగా నటించాడు.