Corona Virus: దేశంలో 53 లక్షలు దాటిన కరోనా కేసులు

Indias COVID19 case tally crosses 53lakh mark
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 93,337 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 53,08,015కు చేరింది.

గ‌త 24 గంట‌ల సమయంలో 1,247 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 85,619కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 42,08,432 మంది కోలుకున్నారు. 10,13,964 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.  
                       
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 6,24,54,254 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 8,81,911 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.  
        
Go Back to Shorts
Corona Virus
COVID-19
India

More Telugu News