China: చైనాను వణికిస్తున్న మరో వ్యాధి.. జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతున్న బ్యాక్టీరియా

  • వేగంగా వ్యాప్తి చెందుతున్న బ్రూసిల్లోసిస్ బ్యాక్టీరియా 
  • లాంజౌ నగరంలో ఇప్పటికే 3,245 మందికి సోకిన వైనం
  • ప్రభుత్వ బయో ప్లాంట్ నుంచి గాలి ద్వారా బయటకు వచ్చినట్టు అనుమానం
Thousands in China Test Positive for a Bacterial Infection

నిన్నమొన్నటి వరకు కరోనాతో అల్లాడిపోయిన చైనాను మరో వ్యాధి వణికిస్తోంది. ఈసారి బ్యాక్టీరియా రూపంలో అలజడి రేపుతోంది. కొత్తగా వెలుగు చూసిన ఈ బ్యాక్టీరియా వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతూ కలవరపెడుతోంది. గాలి ద్వారా ఈ బ్యాక్టీరియా సోకినట్టు గుర్తించారు. జంతువుల ద్వారా సోకిన బ్రూసిల్లోసిస్ బ్యాక్టీరియా గన్సు ప్రావిన్స్ రాజధాని లాంజౌ నగరంలో ఇప్పటికే 3,245 మందికి సోకినట్టు ప్రభుత్వం తెలిపింది.

మరో 1,401 మందికి ఇది ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నట్టు పేర్కొంది. ఈ వ్యాధి సోకిన వారికి జ్వరం, కీళ్ల నొప్పులు, తలనొప్పి, అవయవాల వాపు, పురుషులు సంతాన సాఫల్యత కోల్పోయే ప్రమాదం ఉంటుందని వివరించింది. ప్రభుత్వ బయో ఫార్మాస్యూటికల్ ప్లాంట్ నుంచి గాలి ద్వారా ఇది సోకినట్టు తెలుస్తుండగా, ప్లాంట్ నిర్వహణ సరిగా లేకపోవడం వల్లే బ్యాక్టీరియా వ్యాప్తి చెందిందని చెబుతున్నారు.

More Telugu News