Vasupalli Ganesh: వైసీపీకి దగ్గర కానున్న టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్!

Vizag MLA Vasupalli Ganesh To Leave Telugudesam
  • విశాఖ సౌత్ ఎమ్మెల్యేగా ఉన్న వాసుపల్లి
  • నేడు జగన్ తో సమావేశం  
  • అనంతరం మరింత స్పష్టత
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి మరో ఎమ్మెల్యే దూరం కానున్నారు. విశాఖ సౌత్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న వాసుపల్లి గణేశ్, ఆ పార్టీని వీడి, వైసీపీకి దగ్గర కావాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో నేడు సీఎం వైఎస్ జగన్ ను ఆయన కలవనున్నారు.

ఇటీవలి కాలంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు వాసుపల్లి దూరంగా ఉంటున్నారు. అయితే, టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలిచినా, ఆ పార్టీకి దూరంగా ఉంటూ, వైసీపీకి దగ్గరగా ఉంటున్న వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరిల బాటలోనే వాసుపల్లి గణేశ్ కూడా నడుస్తారని, పార్టీలో చేరకుండానే మద్దతుగా నిలిచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక వాసుపల్లి వైసీపీలో అధికారికంగా చేరుతారా? లేక దూరంగా ఉంటూ మద్దతిస్తారా? అన్న విషయమై మరింత స్పష్టత నేడు రానుంది.
Vasupalli Ganesh
Telugudesam
YSRCP
Jagan

More Telugu News