Reliance: వ్యాపారులకు ప్రత్యేకంగా... 19 వరకూ ఆఫర్లతో రిలయన్స్ రిటైల్ అమ్మకాలు!

Reliance Retail Special Sales for Businessmen
షార్ట్స్‌లో చూడండి
రిలయన్స్ రిటైల్ అనుబంధ ఫ్యాషన్ వేర్ ప్లాట్‌ఫామ్ ఆజియో, "సంబంధం- 2020" పేరిట ఆన్ ‌లైన్ ట్రేడ్ షో నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న రీటైలర్లను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా దీన్ని ప్రారంభించినట్టు వెల్లడించింది. ప్రస్తుతం కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ప్రయాణాలు ఎక్కువగా చేసే పరిస్థితి లేదని, ఇదే సమయంలో వ్యాపారాలను ఆపే పరిస్థితి కూడా లేని వేళ, వ్యాపారులు తమకు కావాల్సిన దుస్తుల్ని కొనేందుకు ఈ వర్చువల్ ఈవెంట్ ను 19 వరకూ నిర్వహిస్తున్నామని తెలిపింది.

ఈ ట్రేడ్ షోలో రాబోయే ఫెస్టివల్ సీజన్‌కు కావాల్సిన దుస్తులను కొనుగోలు చేయవచ్చని, దుస్తులతో పాటు ఆఫీసులు, ఇళ్లకు కావాల్సిన లగ్జరీ, సేఫ్టీ ప్రొడక్ట్స్ కూడా అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ ఆన్ ‌లైన్ ట్రేడ్ షోలో 1,300 పైగా బ్రాండ్లకు చెందిన లక్షలాది ఉత్పత్తులు అమ్మకాలకు సిద్ధమని, ఫెస్టివల్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక 'ఫెస్టీవ్ కలెక్షన్' కూడా ఉందని సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది.
Go Back to Shorts
Reliance
Ajio
Sales
Online Sales

More Telugu News