Ashok Gasti: బీజేపీ ఎంపీ అశోక్ గస్తీ చనిపోలేదు: డాక్టర్ సుదర్శన్ భల్లాల్

MP Ashok Gasti not dead clarifies dr Sudarshan Bhallal
  • అశోక్ గస్తీ మృతి చెందారంటూ వార్తలు
  • ఆయనకు చికిత్స అందిస్తున్నామన్న భల్లాల్
  • ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వ్యాఖ్య
బీజేపీ రాజ్యసభ సభ్యుడు అశోక్ గస్తీ కరోనాతో పోరాడుతూ బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో మృతి చెందారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తపై తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో మణిపాల్ ఆసుపత్రి డాక్టర్ సుదర్శన్ భల్లాల్ ఈ అంశంపై స్పందించారు.

అశోక్ గస్తీ చనిపోయారనే వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. ప్రస్తుతం ఆయన తీవ్ర అనారోగ్యంతోనే ఉన్నారని... ఐసీయూలో లైఫ్ సపోర్ట్ పై ఉంచి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. అశోక్ గస్తీ ఇటీవలే కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన ఎంపీ కావడం ఇదే తొలిసారి.
Ashok Gasti
BJP
Rajya Sabha
Corona Virus

More Telugu News