Corona Virus: దేశంలో కరోనా కేసుల విజృంభణ.. అప్‌డేట్స్‌

Record 97894 fresh COVID19 cases in India
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 97,894 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 51,18,254కు చేరింది.

గ‌త 24 గంట‌ల సమయంలో 1,290 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 83,198కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 40,25,080 మంది కోలుకున్నారు. 10,09,976  మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.  
                        
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 6,05,65,728 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 11,36,613 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID-19
India

More Telugu News