తెలంగాణలో వెయ్యి దాటిన కరోనా మృతుల సంఖ్య
Add ap7am to your home Screen

తెలంగాణలో వెయ్యి దాటిన కరోనా మృతుల సంఖ్య

2159 new corona cases in telangana
  • గత 24 గంటల్లో కొత్తగా 2,159 కేసులు 
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,65,003
  • ఇప్పటివరకు మొత్తం 1,33,555 మంది డిశ్చార్జ్
  • ఆసుపత్రుల్లో 30,443 మందికి చికిత్స
తెలంగాణ‌లో క‌రోనా కేసుల విజృంభణ కొన‌సాగుతోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,159 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో తొమ్మిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2108 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,65,003కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,33,555 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,005కు చేరింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 30,443 మంది చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 318  కేసులు నమోదయ్యాయి.  

               

  
Corona Virus
COVID-19
Telangana

More Telugu News