Ashok Reddy: శ్రావణి ఆత్మహత్య కేసులో నిందితుడైన సినీ నిర్మాత అశోక్ రెడ్డి అరెస్ట్

Police arrested RX100 movie producer Ashok Reddy
  • నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఏ2గా అశోక్ రెడ్డి
  • పరారీలో ఉన్న ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు
  • వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలింపు
బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో సినీ నిర్మాత అశోక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ఆత్మహత్యకు కారణమైన ముగ్గురు నిందితుల్లో దేవరాజ్ రెడ్డి, సాయికృష్ణారెడ్డిలను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏ2గా ఉన్న 'ఆర్ఎక్స్ 100' సినిమా నిర్మాత అశోక్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇవ్వగా... సోమవారం వస్తానని చెప్పి, ఆ తర్వాత ఫోన్ స్విచ్చాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పరారీలో ఉన్న ఆయనను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.  

సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని ఆశ చూపి, శ్రావణితో అశోక్ రెడ్డి సంబంధం ఏర్పరచుకున్నాడని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. అయితే, దేవరాజ్ కు శ్రావణి దగ్గర కావడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. సాయికృష్ణ ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి వారిద్దరూ విడిపోయేందుకు యత్నించాడు. ఈ నెల 7న అమీర్ పేట హోటల్ వద్ద శ్రావణి, దేవరాజ్ గొడవపడ్డారు. ఆ తర్వాత సాయికృష్ణ ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే అశోక్ రెడ్డి అక్కడ ఉన్నాడు. ఆ తర్వాత అందరూ కలిసి ఆమెను హింసించారు. అనంతరం ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.
Ashok Reddy
RX100 Movie
Sravani
Suicide
Arrest

More Telugu News