Naga Babu: తనకు కరోనా సోకిందని వెల్లడించిన సినీనటుడు నాగబాబు

Testes positive nagababu
  • వ్యాధి వచ్చిందని బాధపడొద్దు
  • దాని నుంచి కోలుకుని వేరొకరికి సాయం చేయాలి
  • కరోనాని జయిస్తా.. ప్లాస్మా దానం చేస్తా
సినీ నటుడు, జనసేన నేత నాగబాబుకు కరోనా సోకింది. ఇటీవల కరోనా పరీక్షలు చేయించుకోగా తనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. వ్యాధి వచ్చిందని బాధపడకుండా, దాని నుంచి కోలుకుని వేరొకరికి సాయం చేయాలని ఆయన అన్నారు. తాను  జాగ్రత్తలు పాటించి, కరోనాని జయిస్తానని, అనంతరం ప్లాస్మా దానం చేస్తానని ఆయన చెప్పారు.

దీనిపై స్పందించిన సినీ నటుడు కల్యాణ్‌దేవ్‌ 'మామయ్య మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను' అంటూ కామెంట్‌ పెట్టారు. ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు నాగబాబు సమాధానం ఇచ్చారు. కాగా, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.    
         


Naga Babu
Tollywood
Janasena

More Telugu News