RGV: వర్మ బయోపిక్‌ షూటింగ్‌ షురూ.. కెమెరా ఆన్ చేసిన తల్లి.. క్లాప్‌ కొట్టిన సోదరి

RGV My mom Suryavathi switched on the camera today
  • మురళి నిర్మాణంలో దొరసాయి తేజ దర్శకత్వంలో సినిమా
  • రామ్ గోపాల్ వర్మ పర్యవేక్షణలో మూవీ
  • మూడు పార్ట్‌లుగా రానున్న చిత్రం
బొమ్మాకు మురళి నిర్మాణంలో దొరసాయి తేజ దర్శకత్వంలో రామ్ గోపాల్ వర్మ పర్యవేక్షణలో 'రాము' సినిమా షూటింగ్ ప్రారంభమైంది. రామ్ గోపాల్ వర్మ జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా మూడు పార్ట్‌లుగా రానుంది. మొదటి పార్ట్ షూటింగ్‌ను రామ్ గోపాల్ వర్మ తల్లి సూర్యవతి కెమెరా స్విచ్ ఆన్ చేసి ప్రారంభించగా, ఆయన సోదరి విజయ ఫస్ట్ షాట్‌కు క్లాప్‌ కొట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను  వర్మ తన ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
        
ఈ సినిమాలో రాముగా దొరసాయి తేజ నటిస్తున్నాడు.  పార్ట్‌ 1లో రామ్‌ గోపాల్‌ వర్మ కాలేజ్‌ రోజుల్లో చేసిన సందడిని‌ చూపించనున్నారు. ఈ సందర్భంగా  రామ్ గోపాల్ వర్మ తల్లి సూర్యవతి నుంచి తేజ ఆశీర్వాదం తీసుకున్నాడు. అతని వయసు కేవలం 20 ఏళ్లు మాత్రమేనని వర్మ చెప్పారు.
          
RGV
Tollywood
Viral Pics

More Telugu News