ఏపీలోని మూడు జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరికలు
- ఏపీలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు
- 17వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం
- మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిక
ఈ నేపథ్యంలో వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. 17వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయని... మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.