TikTok: టిక్ టాక్ కొనుగోలుకు మైక్రోసాఫ్ట్ చేసిన యత్నాలు విఫలం!

  • పోటీపడ్డ మెక్రోసాఫ్ట్, ఒరాకిల్ 
  • టిక్ టాక్ ను అమ్మేందుకు బైట్ డ్యాన్స్ సిద్ధంగా లేదన్న మైక్రోసాఫ్ట్
  • టిక్ టాక్ భవితవ్యంపై నెలకొన్న సందిగ్ధత 
Microsoft talks with TikTok unsuccessful

అమెరికాలోని టిక్ టాక్ కార్యకలాపాలను యూఎస్ సంస్థ సొంతం చేసుకుంటేనే దాన్ని కొనసాగిస్తామని... లేని పక్షంలో టిక్ టాక్ ను నిషేధిస్తామంటూ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టిక్ టాక్ ను సొంతం చేసుకునేందుకు మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ సంస్థలు పోటీ పడ్డాయి. అయితే, టిక్ టాక్ తో మైక్రోసాఫ్ట్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. టిక్ టాక్ ను అమ్మేందుకు దాని మాతృసంస్థ బైట్ డ్యాన్స్ సిద్ధంగా లేదని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఈ నేపథ్యంలో, అమెరికాలో టిక్ టాక్ భవితవ్యంపై సందిగ్ధత నెలకొంది.

More Telugu News