ప్రేమ నాటకం ఆడాడు.. అందుకే మా అమ్మాయి ఆత్మహత్య : సీరియల్ నటి శ్రావణి తల్లి

devaraju reasong for sravani suiciede says her mother
  • ప్రియుడు దేవరాజు వల్లే ఆత్మహత్య
  • డబ్బులు తీసుకున్నాడు
  • బాత్‌రూమ్‌లోకి వెళ్లి ఫోన్ చేసింది
  • పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వలేదు
ఇటీవల టీవీ నటి శ్రావణి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తు చేస్తోన్న పోలీసులు ఇప్పటికే పలు విషయాలను గుర్తించారు. తాజాగా, ఆమె తల్లి పాపా రత్నం పలు విషయాలు తెలిపారు. శ్రావణి ప్రియుడు దేవరాజు వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. ఆమె మరో ప్రియుడు సాయి చాలా మంచివాడని చెప్పుకొచ్చారు.

ఈ నెల 7న దేవరాజ్‌తో కలిసి శ్రావణి ఎస్సార్‌నగర్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లగా, అక్కడ వారిద్దరినీ చూసిన సాయి శ్రావణిని కొట్టిన విషయం తెలిసిందే. అనంతరం ఆమె ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆమె కుటుంబ సభ్యులతో కలిసి సాయి ఆమెను కొట్టాడు. దీనిపై పాపా రత్నం స్పందిస్తూ... దేవరాజు నుంచి దూరంగా ఉండాలనే శ్రావణిని సాయి కొట్టాడని చెప్పారు. దేవరాజు తన కూతురితో ప్రేమ నాటకం ఆడాడని తెలిపారు.

శ్రావణి చనిపోయే ముందు బాత్ రూమ్‌ నుంచి దేవరాజుకు ఫోన్ చేసిందని, పెళ్లి చేసుకుంటానని ఆయన మాట ఇవ్వలేదని చెప్పారు. ఈ కారణంతోనే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని చెప్పుకొచ్చారు. ఒకవేళ ఆ రోజు సాయి తమ ఇంట్లో లేకపోతే తమ కుటుంబ సభ్యులందరూ ఆ రోజే చనిపోయేవాళ్లని చెప్పారు. సీరియల్స్ వాళ్లు దేవరాజుకు ఒక ఎత్తు పన్ను పెండింగ్‌లో ఉందని చెప్పగా, తమ కూతురు రూ.10 వేలు పెట్టి పన్ను కట్టించిందని చెప్పారు. అతడు తన కూతురి దగ్గర డబ్బు తీసుకున్నాడని తెలిపారు.
Go Back to Shorts
passes away
sravani
tv

More Telugu News