తెలంగాణ జేఈఈ ర్యాంకర్లను అభినందించిన మంత్రి కేటీఆర్
- శుక్రవారం విడుదలైన జేఈఈ ఫలితాలు
- తెలంగాణకు చెందిన 8 మందికి మెరుగైన ర్యాంకులు
- అమ్మాయిల విభాగంలో చుక్కా తనూజ టాపర్
ఈ సందర్భంగా కేటీఆర్ ట్విట్టర్ లో తన ఆనందాన్ని పంచుకున్నారు. "జేఈఈ మెయిన్ ఎగ్జామ్ లో తమ అమోఘమైన ప్రదర్శనతో అందరినీ గర్వించేలా చేసిన తెలంగాణ యువ కిశోరాలకు నా శుభాభినందనలు. ఓవరాల్ గా 24 మందికి 100 పర్సంటైల్ స్కోరు వస్తే వారిలో 8 మంది తెలంగాణ వాళ్లే. వాళ్లలో అమ్మాయిల విభాగం టాపర్ చుక్కా తనూజ కూడా ఉంది. అద్వితీయమైన సాధన" అంటూ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
చుక్కా తనూజ, వడ్డేపల్లి అరవింద్ కుమార్, రొంగల అరుణ్ సిద్ధార్థ, యశష్ చంద్ర, శిక్ష కృష్ణ సాగి, మోరెడ్డిగారి లిఖిత్ రెడ్డి, రాచపల్లె శశాంక్ అనిరుధ్, చాగరి కౌశల్ కుమార్ జేఈఈ మెయిన్ 2020లో మెరుగైన ర్యాంకులు సాధించారు. కాగా, ఆలిండియా లెవల్లో జేఈఈ మెయిన్ లో రాజస్థాన్ కు చెందిన అఖిల్ జైన్ టాపర్ గా నిలిచాడు.