Corona Virus: దేశంలో క‌రోనా విజృంభ‌ణ అప్ డేట్స్

COVID19 case tally crosses 46 lakh mark
షార్ట్స్‌లో చూడండి
భార‌త్ లో క‌రోనా కేసులు, మృతుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. గత 24 గంటల్లో దేశంలో 97,570 మందికి కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 46,59,985కు చేరింది.

గ‌త 24 గంట‌ల సమయంలో 1,201 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 77,472కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 36,24,197 మంది కోలుకున్నారు. 9,58,316 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.  
Go Back to Shorts
Corona Virus
COVID-19
India

More Telugu News