పవన్ పిలుపుకు అపూర్వ స్పందన... రాష్ట్రవ్యాప్తంగా దీపాలు వెలిగించిన జనసైనికులు
- ఆలయాలపై దాడుల పట్ల పవన్ ఆవేదన
- దీపాలు వెలిగించాలంటూ పిలుపు
- స్వయంగా దీపం వెలిగించి శ్రీకారం చుట్టిన జనసేనాని
పవన్ సైతం తన ఫాంహౌస్ లో ఓ దివ్వె వెలిగించి సనాతన ధర్మ పరిరక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ధర్మాన్ని పరిరక్షిద్దాం-మతసామరస్యాన్ని కాపాడుకుందాం అంటూ స్వయంగా సంకల్పం చెప్పుకుంటూ పవన్ ధ్యానం చేశారు.
ఇక పవన్ పిలుపును పాటిస్తూ విశాఖపట్నం, నందిగామ, నెల్లూరు, మదనపల్లె, తిరుపతి, శ్రీకాళహస్తి, కైకలూరు తదితర ప్రాంతాల్లో జనసైనికులు తమ నివాసాల్లో దీపాలు వెలిగించి సనాతన ధర్మ పరిరక్షణకు మద్దతు తెలిపారు.

