IYR Krishna Rao: మతపరమైన విషయాలలో మీ చిత్తశుద్ధిని తెలియజేయాలంటే ఈ 7 అంశాల‌పై చ‌ర్య‌లు తీసుకోండి: ఐవైఆర్

  • హిందూ సంస్థల నుంచి అన్యమతస్తులను తొలగించాలి
  • ధార్మిక పరిషత్ ను వెంటనే ఏర్పాటు చేయాలి
  • హిందూ మత ప్రచారానికి కార్యాచరణ రూపొందించాలి
  • ఆలయాల ఆదాయాన్ని దానికే ఉపయోగించాలి
IYR Tweets on religion

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌స్తుతం హిందూ మ‌తం చుట్టూ రాజ‌కీయాలు తిరుగుతోన్న నేప‌థ్యంలో ఏపీ ప్ర‌భుత్వ మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఐవైఆర్ కృష్ణారావు దీనిపై స్పందించారు. కనపడని మతపరమైన  అజెండా ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న అనుమానం ప్రజల్లో ఉందని, దాన్ని పోగొట్టాలంటే కొన్ని చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పారు.

"నిజానిజాలు ఈ దర్యాప్తు ద్వారా బయటికి వస్తాయి అని ఆశిద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మతపరమైన విషయాలలో తన చిత్తశుద్ధిని తెలియజేయాలంటే ఈ కింది అంశాల పైన కూడా స్పందించి వెంటనే చర్యలు తీసుకుంటే బాగుంటుంది.

1. హిందూ మత సంస్థల నుంచి అన్యమతస్తులను తొలగించడం.
2. ధార్మిక పరిషత్ ను వెంటనే ఏర్పాటు చేసి ఆలయాలలోని ధార్మిక సిబ్బందిని  పరిషత్ పరిధిలోనికి తీసుకురావటం.
3. దేవాలయాల నిర్వహణ కమిటీల నియామకం ధార్మిక పరిషత్  కు అప్పజెప్పడం.
4. దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు ఒక కార్యాచరణను రూపొందించి  అమలు చేయడానికి చిత్తశుద్ధి ఉన్న అధికారిని నియమించడం
5. హిందూ మత ప్రచారానికి కార్యాచరణ రూపొందించి ఆలయాల ఆదాయాన్ని దానికే ఉపయోగించటం.
6. లౌకిక సిబ్బందిని ఆలయాలలో తగ్గించి నిర్వహణ ఖర్చులు తగ్గించటం.
7. మత ప్రచారంలో భాగంగా పరమత ద్వేషాన్ని రెచ్చగొట్టటం నేరంగా చేసి కఠిన చర్యలు తీసుకోవడం.
 
కనపడని మతపరమైన  అజెండా ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది అనే అనుమానం ప్రజల్లో బలంగా ఉంది. ఈ అపోహను తొలగించాలంటే ఈ అంశంలో తమ చిత్తశుద్ధిని చర్యల ద్వారా నిరూపించుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది" అని ఐవైఆర్ కృష్ణారావు అన్నారు.

More Telugu News